Saturday 12 May 2018

కిట కిట తలుపులు

కిట కిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం

అటు ఇటు తిరుగుతు అలిసిన మనసుకు చంద్రోదయం

రెండు కలిసి ఒకసారే ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ


నిన్నిలా చేరే దాక ఎన్నడూ నిదురే రాక

కమ్మని కలలో అయినా నిను చూడలేదే

నువ్విలా కనిపించాక జన్మలో ఎపుడూ ఇంకా

రెప్పపాటైనా లేక చూడాలనుందే

నా కోసమా అన్వేషణ నీడల్లె వెంట ఉండగా

కాసేపిలా కవ్వించవా నీ మధుర స్వప్నమై ఇలా ప్రేమ ప్రేమ


కంట తడి నాడూ నేడూ చెంప తడిమిందే  చూడు

చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా

చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి

అమృతం అయిపోలేదా ఆవేదనంతా

ఇన్నాళ్ళుగా నీ ఙాపకం నడిపింది నన్ను జంటగా

ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కొంటెగా ప్రేమ ప్రేమ

Friday 9 March 2018

ఎవరో ఒకరు

ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరీ
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరీ
వెనుకవచ్చు వాళ్ళాకు బాట అయినది  ||ఎవరో ఒకరు||

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా
అనుకుని కోడి కూత నిదరపోదుగా
జగతికి మేలుకొల్పు మానుకోదుగా
మొదటి చినుకు సూటిగా దూకిరానిదే
మబ్బుకొంగు చాటుగా ఒదిగి దాగితే
వానధార రాదుగా నేలదారికీ
ప్రాణమంటు లేదుగా బ్రతకడానికీ  ||ఎవరో ఒకరు||

చెదరకపోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్కచాటు చిన్ని కాంతికి
దానికి లెక్కలేదు కాళరాతిరీ
పెదవి ప్రమిద నిలపనీ నవ్వు జ్యోతినీ
రెప్పవెనుక ఆపనీ కంటినీటినీ
సాగలేక ఆగితే దారి తరుగునా?
జాలిచూపి తీరమే దరికి చేరునా  ||ఎవరో ఒకరు||

యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలిసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒళ్ళు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా ||ఎవరో ఒకరు||

Monday 17 July 2017

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా
ఆ కలల వెనకే అడుగు కదిపే ఆరాటం
ఏ క్షణము నిజమై కుదుట పడునో ఆవేశం
ప్రతి రోజు నీలో చిగురేసే ఆశే జతగా
నడిచేనా శ్వాసై నిను గమ్యం చేర్చే దిశగా

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తియమనదా

చెరగదే జ్ఞాపకమేదైనా పసితనం దాటిన ప్రాయాన
సమరమే స్వాగతమిచ్చేనా
కలగనే ఆశయమేదైనా బతుకులో ఆశలు రేపేనా
ఇపుడిలా నీ దరి చేరేనా
ఎదను తాకే గాయలు తాగే నేస్తాలు నీలో
ఎదురు చూసే కాలాలు పూసే చైత్రాలు నీ దారిలో

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా

వెలుగయే వేకులలెన్నైనా వెతికితే లేవా నీలోనా
జగతికే దారిని చూపేనా
గగనమే నీ తొలి మజిలీనా గమనమే ఓ క్షణమాగేనా
విజయమే నీడగ సాగేనా
అలలు రేపే సంద్రాలు దూకే సైన్యాలు నీలో
చెలిమి కోరే లొకాలు చేసే స్నేహాలు ఈ వేళలో

కదిలే పాదమిది నదిలా సాగమనదా
పయనం ఆపకని పరుగే తీయమనదా

Saturday 18 March 2017

"నేను"

నాకంటే బలవంతులు ఉన్నారు,బలహీనులూ ఉన్నారు
కానీ నేను నేనే

నాకంటే తెలివైనవాళ్ళు ఉన్నారు,అజ్ఞానులూ ఉన్నారు
కానీ నేను నేనే

నాకంటే ధనికులు ఉన్నారు,కడు పేదలూ ఉన్నారు
కానీ నేను నేనే

నాకంటే ఆరోగ్యవంతులు ఉన్నారు,రోగ పీడితులూ ఉన్నారు
కానీ నేను నేనే

నాకంటే ఉత్తములు ఉన్నారు,అధములూ ఉన్నారు
కానీ నేను నేనే

నాకంటే అదృష్టవంతులు ఉన్నారు,దురదృష్టవంతులూ ఉన్నారు
కానీ నేను నేనే

ఈ "నేను" నేను మాత్రమే కాదు ,నువ్వు,తను,వారు,వీరు,అందరూ..
పోటీ,పోలిక అనివార్యమైన ఈ ప్రపంచంలో నీకై ఒక లక్ష్యాన్ని సృష్తించుకుని, నీదైన మార్గాన్ని అవలంబిస్తూ ,అందరినీ కలుపుకుపోవడం ఎంతైనా అవసరం 

Saturday 26 November 2016

కోటి కోటి తారల్లోనా చందమామ ఉన్నన్నాళ్లూ 
నీ మనస్సులో నేనుంటానే
కోటి కోటి తారల్లోనా చందమామ ఉన్నన్నాళ్లూ
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే
గాలి లోన ఆరోప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు
గాలి లోన ఆరోప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు
నిన్ను నేనే ఆరాధిస్తా నీకోసం ఆరా తీస్తా

కోటి కోటి తారల్లోనా చందమామ ఉన్నన్నాళ్లూ
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే

ఏడు వింతలున్నన్నాళ్లు నీకు తోడునై వుంటా
పాలపుంత ఉన్నన్నాళ్ళు నన్ను పంచి నేనుంటా
పాదమున్ననాళ్ళు నీ నడక లాగ నేనుంటా
కోరుకున్న చోటల్లా చేర్చుతా
చేతులున్ననాళ్లు నీ గీతలాగా నేనుంటా
జాతకాన్ని అందంగా మార్చుతా
అంకెలింక ఉన్నన్నాళ్ళు నీ వయస్సు సంఖ్యవనా
ఆ సంఖ్యలల్లో బంధిస్తుంటా వంద యేళ్ళిలా

కోటి కోటి తారల్లోనా చందమామ ఉన్నన్నాళ్లూ
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే

భాషనేది ఉన్నన్నాళ్ళు నిన్ను పొగిడి నేనుంటా
ధ్యాసనేది ఉన్నన్నాళ్ళు నిన్ను తలచి నేనుంటా

వెలుగు ఉన్న నాళ్లూ నీ వెనుక నేను వేచుంటా
నువ్వేటేపు వెళుతున్నా సాగనా
మసక ఉన్న నాళ్ళు నీ ముందుకొచ్చి నిలుచుంటా
నువ్వెలాగా ఉన్నవో చూడనా
నీకు దూరమున్నన్నాళ్లు జ్ఞాపకంగా వెంటుంటా
మళ్ళి మళ్ళి గురుతొస్తుంటా ముందు జన్మలా

కోటి కోటి తారల్లోనా చందమామ ఉన్నన్నాళ్లూ
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే


గాలి లోన ఆరోప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు
గాలి లోన ఆరోప్రాణం కలవకుండా ఉన్నన్నాళ్ళు
నిన్ను నేనే ఆరాధిస్తా నీకోసం ఆరా తీస్తా

కోటి కోటి తారల్లోనా చందమామ ఉన్నన్నాళ్లూ
నీ మనస్సులో నేనుంటానే
నీటి మీద ఆ కైలాసం తేలకుండా ఉన్నన్నాళ్ళు
నీ తపస్సు నే చేస్తుంటానే

Sunday 11 August 2013

సరిగా పడనీ

సరిగా పడనీ ఇపుడే తొలి అడుగు
సుడిలో పడవై ఎపుడూ తడబడకు
మాయలో మగతలో మరుపు ఇంకెన్నాళ్లు
వేకువై వెలగనీ తెరవిదే నీ కళ్లు
కన్న ఒడి వదలాల్సిందే నీలా నువు నిలవాలంటే
మన్ను తడి తగలాల్సిందే మున్ముందుకు సాగాలంటే
కింద పడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే
ఛలో ఛలో

నిన్నే చూసే అద్దం కూడ నువ్వా కాదా అనదా
అచ్చం నీలా ఉండేదెవరా అంటు లోకం ఉలికిపడదా
సూర్యుడిలో చిచ్చల్లే రగిలించే నీలో కోపం
దీపంలా వెలిగిందా జనులందరిలో
చంద్రుళ్ళో మచ్చల్లే అనిపించే ఏదో లోపం
కుందేలై అందంగా కనపడదే నీలా నవ్వే క్షణాలలో

చెక్కే ఉలితో నడిచావనుకో దక్కే విలువే తెలిసి
తొక్కే కాళ్ళే మొక్కే వాళ్ళై దైవం అనరా శిలను కొలిచి
అమృతమే నువు పొందు విషమైతే అది నా వంతు
అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు
అందరికి బతుకిచ్చే పోరాటంలో ముందుండు
కైలాసం శిరసొంచి నీ ఎదలో ఒదిగే వరకు
ఛలో ఛలో

తికమక మకతిక

తికమక మకతిక పరుగులు ఎటుకేసి
నడవరా నరవరా నలుగురితో కలిసి
శ్రీ రామ చందురున్ని కోవెల్లొ ఖైదు చేసి
రాకాసి రావణున్ని గుండెల్లొ కొలువు చేసి
తల తిక్కల భక్తితో తైతక్కల మనిషీ
తై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై దిదితై
దిదితై దిదితై దిదితై దిదితై దిది


వెతికే మజిలి దొరికేదాక
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చిన క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోని అన్వేషణ కన్నీటిపై వంతెనా
బెదురంటు లేని మది ఎదురుతిరిగి అడిగేనా
బదులంటు లేని ప్రశ్న లేదు లోకానా
నీ శోకమె శ్లోకమై పలికించర మనిషీ
తై దిదితై దిదితై దిదితై దిది


అడివే అయినా కడలే అయినా
ధర్మాన్ని నడిపించు పాదాలకి శిరసొంచి దారీయదా
అటువంటి పాదాల పాదుకలకి పట్టాభిషేకమె కదా
ఆ రామ గాధను రాసుకున్నదె కాదా
అది నేడు నీకు తగుదారి చూపనందా
ఆ అడుగుల జాడలు చెరపొద్దురా మనిషీ